
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పిస్తుండగా.. ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి తాజాగా రెండో పాట విడుదలైంది.
వీరమల్లును కొల్లగొట్టినాదిరో
‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ మాస్ బీట్ ను సింగర్స్ మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహరా, యామిని ఘంటశాల పాడారు. చంద్రబోస్ లిరిక్స్, కీరవాణి స్వరాలు అందించిన ఈ పాటలో పవన్‌తో కలిసి యాంకర్ అనసూయ, పూజిత పొన్నాడ స్టెప్పులేశారు. ‘బిగ్ స్క్రీన్స్‌లో ఈ పాట మోత మోగిపోద్దంటూ’ ఈ సాంగ్ ను ఉద్దేశించి అనసూయ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.
చారిత్రాత్మక యోధుడిగా పవన్
ఈ మూవీలో పవన్ కల్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్నాడు. బాబీ డియోల్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రల్లో అలరించనున్నారు. మార్చి 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, ‘బాహుబలి’ ఫేమ్ శ్రీనివాస్ మోహన్, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.