బేతి కారుతోనే.. ఉప్పల్​ గెలుపు బండారిదే!

మన ఈనాడు:

కారు స్పీడ్​కు ప్రతిపక్షపార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు..మంత్రి కేటీఆర్​(KTR)వ్యూహాం ముందు ఎవరి ఎత్తుగడలు పనిచేయడం లేదు. అందుకు గ్రేటర్​ హైదరాబాద్​లోని ఉప్పల్​ నియోజకవర్గం చూస్తుంటే అర్థం అవుతుంది. RRR సినిమాను తలపించేలా ఎమ్మెల్యే పోటీదారులంతా ఒకేపార్టీలో బండారి గెలుపు కోసం పనిచేస్తుంటే..కారు గెలుపుకు తిరుగులేదని బీఆర్​ఎస్​(BRS) కార్యకర్తలు జోష్​ మీద ఉన్నారు.

మల్లాపూర్​లో ఈరోజు జరిగే బీఆర్​ఎస్​ ఉప్పల్​ నియోజకవర్గ విస్ర్తృతస్థాయి సమావేశానికి ఉప్పల్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి హజరవుతున్నారు. విషయం తెలిసిన బీఆర్​ఎస్​ కార్యకర్తలు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డిని ప్రకటించిన తర్వాత ఉప్పల్​ ఎమ్మెల్యే బేతి పార్టీని వీడుతున్నారంటూ ప్రచారం జరిగింది. కొద్దిరోజులు కాంగ్రెస్​ పార్టీ ఖరారు అయిందని, మరికొద్దిరోజులు భాజపా సీటు కన్ఫ్​ర్మ్​ అయిదంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతకముందే కేటీఆర్​ నేరుగా బేతి సుభాష్​రెడ్డితో చర్చలు జరిపారు. ఆవార్త ఎక్కడా బయటకు పొక్కకపోవడంతో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు.

తాజాగా బేతి బీఆర్​ఎస్​తోనే బండారి గెలుపుకోసం అడుగులు వేస్తుండటంతో బీఆర్​ఎస్​ అభ్యర్థి గెలుపు తిరుగులేదని సంబురపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్​ టిక్కెట్​ ఆశించి భంగపడిన రాగిడి లక్ష్మారెడ్డి సైతం ఇప్పటికే బీఆర్​ఎస్​లో చేరి కాంగ్రెస్​ ఓటు బ్యాంకు బీఆర్​ఎస్​కు బదిలీ చేసేందుకు సీరియస్​గా తిరుగుతున్నారు.

Share post:

లేటెస్ట్