ManaEnadu:న్యూజిలాండ్(New Zealand)తో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమై తీవ్ర విమర్శల పాలైన టీమ్ఇండియా.. రెండో టెస్టులోనూ అదే ఆటతీరును కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెనువెంటనే వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ముఖ్యంగా భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో లంచ్ సమయానికి 107 రన్స్ మాత్రమే చేసి 7 కీలక వికెట్లు కోల్పోయింది. జైస్వాల్(30), గిల్(30) మాత్రమే ఫర్వాలేదనిపించారు. రోహిత్(0), కోహ్లీ(1), పంత్(18), సర్ఫరాజ్(11), అశ్విన్(4) నిరాశపరిచారు. క్రీజులో జడేజా(11), సుందర్(2) ఉండగా భారత్ ఇంకా 152 రన్స్ పరుగుల వెనుకంజలో ఉంది. శాంట్నర్(Mitchell Santner) 4, ఫిలిప్స్ 2 వికెట్లు తీశారు.
259 పరుగులకు కివీస్ ఆలౌట్
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో 259 పరుగులకు ఆలౌట్ అయింది. టీమ్ ఇండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ విజృంభణతో ఒక దశలో 197/4తో పటిష్ఠంగా ఉన్న కివీస్(KIWIS)ను సుందర్ చావు దెబ్బ తీశాడు. మొత్తం 7 వికెట్లు తీసి ప్రత్యర్థుల పతనాన్ని శాసించాడు. బ్లాక్ క్యాప్స్‌లో డెవాన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) ఫిఫ్టీలతో రాణించారు. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు.
అశ్విన్ ఇచ్చిన సూచనలు పనిచేశాయ్: సుందర్
ఇక మ్యాచ్ అనంతరం సుందర్ మాట్లాడారు. న్యూజిలాండ్‌పై తాను 7 వికెట్లు తీయడం వెనుక తన తోటి స్పిన్నర్ అశ్విన్ ఇచ్చిన సూచనలు కీలకమయ్యాయని వాషింగ్టన్ సుందర్ తెలిపారు. ‘బాల్ బాగా సాఫ్ట్‌గా మారడంతో వికెట్ల కోసం బంతిని వేగంగా విసరాలని అశ్విన్ సూచించారు. ఆ టెక్నిక్‌తోనే కాన్వేను ఆయన ఔట్ చేశారు. ఆ సూచన పాటించడంతో పాటు సరైన ప్రాంతాల్లో బంతిని వేయడం ద్వారా వికెట్లు తీయగలిగాను. అశ్విన్‌తో కలిసి మరిన్ని మ్యాచులు ఆడాలనుకుంటున్నాను’ అని వివరించారు.
https://twitter.com/SaurabhTripathS/status/1849679213479043570