
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishvaksen), ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) జోడీగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లైలా(Laila). రామ్ నారాయణ్(Ram Narayan) డైరెక్షన్ వహించిన ఈ సినిమా వాలంటైన్స్ డే(Valentine’s Day) స్పెషల్‌గా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీకి తనిష్క్ బాగ్చీ సంగీతం అందించగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్(Promotions) జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా సీనియర్ నటుడు పృథ్వీరాజ్(Prudhviraj) చేసిన కామెంట్స్‌తో ప్రమోషన్స్ కాస్త కాంట్రవర్సీకి తెరలేపాయి. కాగా ఈ మూవీకి సంబంధించి తాజాగా సెన్సార్ అప్డేట్, రన్ టైమ్ విషయాలను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
విశ్వక్ సేన్ డిఫరెంట్ యాంగిల్‌లో నటించిన ‘లైలా’ మూవీకి సెన్సార్ బోర్డు(Sensor board) A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్(Run Time) ఎండింగ్ కార్డ్స్‌తో కలుపుకొని 2 గంటల 16 నిమిషాలు ఉన్నట్లు మూవీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ‘‘క్రిస్పీ డురేషన్ సెట్ చేశాం’’ అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఎల్లుండి థియేటర్లో కలుద్దాం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
పృథ్వీ కామెంట్స్‌తో వివాదం
కాగా..”లైలా”(Laila) చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్(Actor Prudhviraj) చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దూమరాన్ని రేపాయి. పృథ్వీ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీని ఉద్దేశించే అని వైసీపీ(YCP) వర్గీయులు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ లైలా(boycottliala) అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా ఫిబ్రవరి 14న విడుదల అవనున్న ఈ సినిమా HD ప్రింట్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగారు.
ఆసుపత్రి బెడ్ మీది నుంచే వార్నింగ్
దీంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ అడిగిన తర్వాత కూడా ట్రోలింగ్ ఆగలేదు. పైగా పృథ్వీకి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆసుపత్రి బెడ్ మీది నుంచే మీడియాతో మాట్లాడిన పృథ్వీ మరోసారి బూతులతో రెచ్చిపోయారు. వైసీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. 11 అనే మాట వస్తేనే వైసీపీ వాళ్లు గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు.
#Laila Runtime : 2 hrs 16 mins !!
Crisp Duration సెట్ చేశారు 👍
— Rajesh Manne (@rajeshmanne1) February 12, 2025