Paleru reservoir: సాగర్​ జలలు కోసం..BRS నేతల ఆందోళ

Khammam: కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగానే పంటలు ఎడిపోతున్నాయని ఖమ్మం బీఆర్​ఎస్​ నాయకులు ఆందోళన చేపట్టారు. తక్షణమే సాగర్​ జలాలతో పాలేరు రిజర్వాయర్​ నింపాలని డిమాండ్​ చేశారు.

పూర్తిగా అడుగంటిన పాలేరు జలాశయాన్ని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు(MLC THATHA MADHU) అధ్వర్యంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాలేరు జలాశయం పరిశీలించారు. నేలకొండపల్లి మండల పరిధిలోని ఎండిపోయిన పంట పోలాలను వారు పరిశీలించి తక్షణమే నీళ్లు విడుదల రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు ఇప్పటికే తాగునీళ్లు లేక అల్లాడుతున్నారన్నారు. ప్రజల పక్షాన తాము పోరాడి అండగా నిలుస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా కాంగ్రెస్​ ప్రభుత్వ పెద్దల క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

ఈకార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు , మాజీ ఎమ్మేల్యేలు సండ్ర వెంకట వీరయ్య , బానోత్ మధన్ లాల్, చంద్రావతి పాల్గొన్నారు.

Share post:

లేటెస్ట్