
డీలిమిటేషన్(Delimitation) అంశంపై దక్షిణాది రాష్ట్రాల నేతలు నేడు భేటీ కానున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(Tamil Nadu CM MK Stalin) అధ్వర్యంలో చెన్నై(Chennai)లో ఈ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth), BRS నేత KTRతో పాటు 7 రాష్ట్రాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సమావేశం లక్ష్యం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకు ఎదురయ్యే సవాళ్లను చర్చించడం, ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం. ఇప్పటికే ఈ భేటీ కోసం తెలంగాణ సీఎం రేవంత్ చెన్నైకి చేరుకున్నారు.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళన
ఈ సమావేశంలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్ర ప్రతినిధులు పాల్గొంటారని తెలుస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య(Number of constituencies)ను పెంచడం వల్ల ఉత్తర భారత రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
రేవంత్ రెడ్డి, స్టాలిన్ మధ్య ప్రాథమిక చర్చలు
సమావేశానికి ముందు రేవంత్ రెడ్డి, స్టాలిన్ మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయనీ, ఈ అంశంపై కాంగ్రెస్, డీఎంకేలు ఉమ్మడి నిర్ణయం తీసుకోనున్నాయని సమాచారం. కేటీఆర్ హాజరవడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. BRS ఈ విషయంలో దక్షిణ రాష్ట్రాలతో కలిసి నడవాలని భావిస్తోంది. ఈ సమావేశంలో రాజ్యసభ(Rajyasabha), లోక్‌సభ(Loksabha) స్థానాల సంఖ్యపై జనాభా ఆధారిత డీలిమిటేషన్ ప్రభావం, దాన్ని ఎదుర్కోవడానికి చట్టపరమైన, రాజకీయ చర్యలపై చర్చ జరగనుంది. ఈ సమావేశం దక్షిణ భారత రాష్ట్రాల ఐక్యతను చాటే అవకాశంగా భావిస్తున్నారు.