మన ఈనాడు:
తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ బలం ఎంటో బీఆర్ఎస్కి చూపిద్దామని, అధికారం సాధించుకుందామని ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందుముల పరమేశ్వరరెడ్డి అన్నారు. మల్లాపూర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నెమలి అనీల్ అధ్యక్షతన జరిగింది. కేసీఆర్ రాక్షస పాలన చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ మళ్లీ కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజల ప్రభుత్వం సాధించే దిశగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సారధ్యంలో అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. 6గ్యారంటీలతో పథకాలు ప్రజల్లోకి విస్ర్తృతంగా తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు.
ఉప్పల్ కాంగ్రెస్ సైనికలు ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ దమ్ము, బలం చూపించి సీఎం కేసీఆర్కు దిమ్మతిరిగే షాక్ ఇద్దామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.