Gas Cylinder Price | మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల గ్యాస్ (Gas) సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. 2 కేజీల దగ్గరి నుంచి 19 కేజీల వరకు సిలిండర్లు (LPG Cylinder) ప్రస్తుతం లభిస్తున్నాయి. ఇంకా ఎక్కువ పరిమాణంలో ఉన్న సిలిండర్లు కూడా ఉంటాయి. మనం ఇప్పుడు ఏ ఏ సిలిండర్ ధర ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. సిలిండర్ పరిమాణం ఆధారంగా రేటు కూడా మారుతుంది. అందువల్ల ఏ ఏ గ్యాస్ సిలిండర్ రేటు ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
మార్కెట్‌లో 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 14.2 కేజీలు, 19 కేజీలు ఇలా పలు రకాల పరిమాణాల్లో గ్యాస్ సిలిండర్లు లభిస్తున్నాయి. సాధారణంగా ఇళ్లలో ఉపయోగించే సిలిండర్లలో 14.2 కేజీల గ్యాస్ ఉంటుంది. ఎక్కువ మంది వీటినే కలిగి ఉంటారు. ఈ సిలిండర్ ధర రూ. 1155 వద్ద ఉంది. అలాగే ఇంకా ఇటీవల కాలంలో 10 కేజీల గ్యాస్ సిలిండర్లకు కూడా డిమాండ్ నెలకొంది. ఇవి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని కంపొసైట్ గ్యాస్ సిలిండర్లు అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఈ 10 కేజీల గ్యాస్ సిలిండర్ ధర తక్కువగా ఉంటుంది. ఎందుకంటే 14.2 కేజీల కన్నా ఇందులో తక్కువ గ్యాస్ ఉంటుంది. మీరు ఈ సిలిండర్‌ను రూ. 822కు కొనొచ్చు. మీరు 14.2 కేజీల గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటే 14.2 కేజీల సిలిండర్ మాత్రమే ఉపయోగించగలరు. అదే 10 కేజీల సిలిండర్ కొనాలంటే.. గ్యాస్ కనెక్షన్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. తర్వాతనే మీరు 10 కేజీల కంపొసైట్ గ్యాస్ సిలిండర్ కొనుగోల చేయగలరు. అలాగే మార్కెట్‌లో ఇంకా ఇతర తక్కువ పరిమాణంలోని సిలిండర్లు కూడా ఉన్నాయి.
5 కేజీల సిలిండర్ కూడా ఉంది. మీరు దీన్ని సులభంగానే కొనొచ్చు. దీని రేటు రూ. 423గా ఉంది. మీరు దగ్గరిలోని ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి ఈ సిలిండర్ కొనొచ్చు. లేదంటే బయటి షాపుల్లో కూడా వీటిని విక్రయిస్తూ ఉంటారు. అలాగే 2 కేజీ సిలిండర్ కూడా ఉంది. దీని రేటు ఇంకా తక్కువ. మీరు దీన్ని రూ.240కు కొనుగోలు చేయొచ్చు. అలాగే 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర విషయానికి వస్తే.. ఈ సిలిండర్ రేటు రూ. 1918గా ఉంది. అలాగే 47.5 కేజీల సిలిండర్లు కూడా ఉంటాయి. దీని రేటు రూ. 4800 ఉంటుంది.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…