Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్‌’ ఫస్ట్‌ లుక్ రిలీజ్

Mana Enadu: ‘హే.. కళ్లజోడు కాలేజీ పాప చూడు.. ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు.. ఎర్ర రోజాపువ్వు సేతికిచ్చి చూడూ.. అందరిముందు ఐలవ్యూ సెప్పిచూడు.. అరే.. పడితే లైన్ల పడతిది.. లేకపోతే తిడ్తది.. పోతె ఇజ్జత్ పోతది.. అదిబోతే ఇంకోతొస్తది’ యూత్ను ఓ ఊపు ఊపేసిన ఈ పాట 2023లో విడుదలైన ‘మ్యాడ్ (MAD Movie)’ మూవీలోనిది. సంగీత్ శోభన్‌ (Sangeet Sobhan), నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

మ్యాడ్ బాయ్స్ ఆర్ బ్యాక్

యూత్‌ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో MAD (మనోజ్, అశోక్, దామోదర్) టీమ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తమ కామెడీతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. వారి ఫ్రెండ్షిప్, ఎమోషన్తో కళ్లనీళ్లు పెట్టించారు. ఇప్పుడు ఈ టీమ్ మరోసారి తెలుగు తెరపై నవ్వులు పూయించేందుకు రెడీ అయింది. ఈ సినిమాకు సీక్వెల్గా మ్యాడ్‌ స్క్వేర్‌ (Mad Square)‌ వస్తోందని తెలిసిందే.

మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్..

ఈ నేపథ్యంలో మ్యాడ్ స్క్వేర్ నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌లో సంగీత్ శోభన్‌, నార్నే నితిన్‌ (Narne Nithin), రామ్‌ నితిన్‌ పట్టు పంచెలో స్టైలిష్ లుక్లో కనిపించారు. పట్టుపంచెలో కళ్లకు గాగుల్స్ పెట్టుకుని అల్ట్రా పాష్గా ఉన్న ఈ లుక్ అదిరిపోయింది. మరోసారి ఈ మ్యాడ్ బాయ్స్ ఫన్ పంచేందుకు రెడీ అయ్యారు.

ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే

మరోవైపు ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ (First Single)ను సెప్టెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సీక్వెల్‌కు కూడా పార్ట్-1 తెరకెక్కించిన కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్‌ పార్టులో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్‌, గోపికా ఉద్యన్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. మరి సీక్వెల్‌లో ఎవరెవరు సందడి చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది. భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

Share post:

లేటెస్ట్