
ఇటీవల ‘అమరన్(Amaran)’ మూవీతో తమిళ హీరో శివ కార్తికేయన్(Siva karthikeyan) భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో జోరు మీదున్న శివకార్తికేయన్.. డైరెక్టర్ AR మురుగదాస్‌తో కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు.
‘SK23’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్(Glimpse)ను విడుదల చేశారు. ఈరోజు శివకార్తికేయన్ బర్త్ డే(Siva karthikeyan’s birthday) సందర్భంగా ఈ గ్లింప్స్‌ను విడుదల చేసి, సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు. శ్రీలక్ష్మీ మూవీస్(Sri Lakshmi Movies) సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మదరాసి(Madharasi)’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టారు మేకర్స్.
భయంకరమైన కొత్త లుక్‌లో శివ కార్తికేయన్
తాజాగా రిలీజైన గ్లింప్స్‌లో శివకార్తికేయన్ మునుపెన్నడూ చూడని భయంకరమైన కొత్త లుక్(new Look)లో కనిపించారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామోన్ అద్భుతమైన విజువల్స్ యాక్షన్ ఎలివేట్ చేయగా, అనిరుధ్ రవిచంద్రన్ BGM దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ మూవీలో రుక్మిణి వసంతన్(Rukmini Vasanthan) హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే పూర్తిస్థాయి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ తెలిపారు.