శివకార్తికేయన్(Sivakarthikeyan) హీరోగా, ఏ.ఆర్.మురుగదాస్ (A.R. Murugadoss) దర్శకత్వంలో రూపొందిన పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మదరాసి(Madraasi)’. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ మూవీ ట్రైలర్((Trailer) తాజాగా విడుదలైంది. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ శివకార్తికేయన్‌ను ఫుల్ మాస్, ఫియర్స్ లుక్‌లో చూపిస్తూ, ఆయన రాష్ట్రాన్ని కాపాడే పోరాటంతో ఆకట్టుకుంది. మురుగదాస్ ఈ చిత్రాన్ని యాక్షన్ సీన్స్‌తో నింపి, లవ్ స్టోరీ, సాంగ్స్‌ను పక్కన పెట్టి, సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
మురుగదాస్‌కు కమ్ బ్యాక్ ప్రాజెక్టుగా..
ట్రైలర్‌లో విద్యూత్ జమ్మ్వాల్, బిజూ మేనన్(Biju Menon), విక్రాంత్‌లు ఇంటెన్స్ లుక్‌లో కనిపించగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కీలక పాత్రలో దర్శనమిచ్చింది. షబీర్ కల్లరక్కల్(Shabir Kallarakkal) విలనిజంతో ఆకర్షిస్తుండగా, అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘సెలవికా’ హిట్‌గా నిలిచి, సినిమాపై అంచనాలను పెంచింది. మురుగదాస్‌కు గత కొన్ని చిత్రాల తర్వాత ఈ సినిమా కమ్‌బ్యాక్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. శివకార్తికేయన్ వరుస విజయాలతో ఉన్న ఫామ్, మురుగదాస్ యాక్షన్ థ్రిల్లర్ నైపుణ్యం కలిసి ‘మదరాసి’పై భారీ హైప్ నెలకొంది.






