మౌని అమావాస్య (Mauni Amavasya) (జనవరి 29)తో పుష్యమాసం ముగిసింది. జనవరి 30వ తేదీ నుంచి మాఘ మాసం ఆరంభమైంది. మాఘ మాసం (Magha Masam)లో శుభకార్యాలు జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి (ఈ నెల 31వ తేదీ) కల్యాణ ఘడియలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మాఘ, ఫాల్గుణ మాసాలలో 25 శుభ ముహూర్తాలున్నట్లు తెలిపారు. జనవరి 31వ తేదీ నుంచి శుభ ముహూర్తాలు మొదలై.. మార్తి 6వ తేదీ వరకు పెళ్లిళ్లు జరుపుకోవచ్చని వెల్లడించారు.
శుభముహూర్తాలు ఇవే
- మాఘ మాసంలో జనవరి 31వ తేదీన ఉదయం, రాత్రి రెండు ముహూర్తాలు
- ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం, రాత్రి
- 7వ తేదీన ఉదయం, రాత్రి
- 13 తేదీన ఉదయం.. 14వ తేదీ రాత్రి
- 16, 20 తేదీల్లో మూడు వేళలు
- ఫిబ్రవరి 22, 23న కూడా రెండేసి ముహూర్తాలు
- ఫాల్గుణ మాసంలో మార్చి నెల 2వ తేదీన ఉదయం, రాత్రి రెండు ముహూర్తాలు
- 6వ తేదీన 3 వేళల్లో కల్యాణ ఘడియలు






