
ప్రపంచంలోనే అత్యంత వైభవంగా కొనసాగుతోన్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా(Kumbh Mela 2025). 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు(Devotees) తరలివస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమం(Triveni Sangamam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 26తో ముగియనుంది. కాగా త్రివేణీ సంగమంలో ఇప్పటి వరకూ వచ్చిన భక్తుల సంఖ్య 50కోట్లు దాటిందని యూపీ సర్కార్ వెల్లడించింది. ఇది భారత్(India), చైనా(Chaina) మినహా మిగిలిన ప్రపంచ దేశాల జనాభాను దాటేసినట్లుగా పేర్కొంది.
మౌని అమావాస్య రోజు దాదాపు 8 కోట్ల మంది రాక
కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య అమెరికా(USA), రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల జనాభా కంటే ఎక్కువ అని తెలిపింది. శుక్రవారం సాయంత్రానికి ప్రయాగ్‌రాజ్(Prayagraj) వచ్చిన భక్తుల సంఖ్య 50 కోట్లు దాటిందని అఫీషియల్‌గా ప్రకటించింది. అయితే జనవరి 29న మౌని అమావాస్య(Mouni Amavasya) రోజు దాదాపు 8 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
60 కోట్లకుపైగా వచ్చే అవకాశం
కాగా కుంభమేళా(Kumbhamela)కు 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. కానీ మరో 11 రోజులు ఉండగానే భక్తుల సంఖ్య 50 కోట్లను దాటింది. దీంతో ఈ సంఖ్య 60 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని UP సర్కార్ అంచనా వేస్తోంది. ఇదిలా ఉండగా, కుంభమేళా విషయమై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అసత్య సమాచారం, తప్పుదోవ పట్టించే వీడియోలు(Videos) వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు.