సినిమా అంటే స్టార్ హీరోహీరోయిన్లు ఉండాలి అనే రోజులు ఎప్పుడో పోయాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ వస్తోంది. అలాంటి కేటగిరీలోనే ఉంది మహా అవతార్ నరసింహ. కాకపోతే ఈ మూవీ ఇంకా డిఫరెంట్. ఈ సినిమాలో నటీనటులు లేనేలేరు.. కానీ థియేటర్స్‌కి వచ్చిన ఆడియన్స్ మాత్రం ఊగిపోతున్నారు. బిగ్ స్క్రీన్ పై రసింహుడి ఉగ్రరూపం చూసి పూనకాలెత్తిపోతున్నారు.
జూలై 25న థియేటర్లలో విడుదలైన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’(Mahavatar Narsimha) బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తోంది. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి పాన్‌ఇండియా హిట్‌లను అందించిన హోంబలే ఫిలిమ్స్ తాజా ప్రయత్నంగా ఈ సినిమాను ప్రెజెంట్ చేసింది. ప్రారంభంలో మాత్రం ఈ ప్రాజెక్టుపై పెద్దగా అంచనాలు కనిపించలేదు.
హోంబలే సంస్థ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ను లాంచ్ చేస్తూ, ఈ యూనివర్స్ నుంచి ఏడు సినిమాలు తీసుకొస్తామన్నారు. అందులో మొదటి భాగంగా ‘మహావతార్ నరసింహ’ ఈ ఏడాది వస్తుందని.. ఆ సంస్థ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది.
మహావతార్ నరసింహ విడుదలైన ముందు రోజు వరకూ, ప్రేక్షకుల్లో కానీ, ట్రేడ్ వర్గాల్లో కానీ ఆసక్తి లేకపోయినా… విడుదల తర్వాత మాత్రం పాజిటివ్ మౌత్ టాక్తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ప్రత్యేకించి పిల్లల నుంచి విశేష స్పందన వస్తోంది.
ఈ సినిమా విడుదలైన తొలి వారం(First Week Collections) లోపే రూ.53 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఫుల్ రన్‌లో ఇది రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించే అవకాశాలున్నాయి.
53 CRORES India GBOC and counting… 💥
The unstoppable #MahavatarNarsimha continues to reign supreme at the box office.Witness the divine rage unfold on the big screen 🦁🔥#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan @AshwinKleem @SamCSmusic… pic.twitter.com/ZeV8LDDelc
— Hombale Films (@hombalefilms) August 1, 2025
స్టార్ కాస్ట్ లేకపోయినా, కంటెంట్ బలంతో ప్రేక్షకుల మన్ననలు గెలుచుకోవచ్చని ‘మహావతార్ నరసింహ’ ఘనంగా నిరూపించింది. ఇది కేవలం ఓ యానిమేషన్ ఫిల్మ్ మాత్రమే కాదు, భక్తి, భావోద్వేగం, టెక్నికల్ క్వాలిటీ మిళితమైన ఒక సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తోంది.






