‘ప్రభాస్ చేస్తానంటే నేను ‘కన్నప్ప’ చేసే వాడిని కాదు’

టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మహాభారతం’ సీరియల్‌ ఫేమ్‌ ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. మంచు మోహన్ బాబు నిర్మించారు. ప్రభాస్, మోహన్ లాల్ (Mohan Lal), శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌ 25న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో విష్ణు ప్రమోషన్స్ లో జోరు పెంచారు. సోలోగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కన్నప్ప గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేశారు విష్ణు.

Image

ప్రభాస్ చేస్తానంటే నేను చేసే వాడిని కాదు

ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రుద్ర అనే పాత్రలో కనిపించనున్న ప్రభాస్ గ్లింప్స్ ఇటీవల విడుదల చేసిన టీజర్ లో కనిపించాయి. కనిపించింది 5 సెకన్లే అయినా ఇంటెన్స్ లుక్ తో ప్రభాస్ అదరగొట్టాడు. ఈ చిత్రం కోసం డార్లింగ్ ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. అయితే ఒకవేళ ప్రభాస్ కనుక కన్నప్ప సినిమా తీస్తానని చెప్పి ఉంటే తాను ఈ చిత్రాన్ని చేసే వాడిని కాదని మంచు విష్ణు అన్నారు. కృష్ణంరాజు ఆశీస్సులు తమ ప్రాజెక్టుకు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర అందరిని థ్రిల్ కు గురి చేస్తుందని వెల్లడించారు.

నేలపైనే పడుకున్నా

“నేను హనుమాన్ భక్తుడిని. అయితే కన్నప్ప (Kannappa) షూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. ఇదంతా శివలీలేనేమో. తిన్నడు కథే కన్నప్ప చిత్రం. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనతో తిన్నడు నాస్తికుడు ఎలా అయ్యాడు.. దేవుడిని ద్వేషించే తిన్నడు శివానుగ్రహం పొంది కన్నప్పగా ఎలా మారాడు అనే అంశాలను మా సినిమాలో చూపించాం. సినిమా షూటింగు సమయంలో నేనేం నియమాలు పాటించలేదు. కానీ తిన్నడు కన్నప్పగా మారిన తర్వాత నేలపైనే పడుకున్నాను’’ అని విష్ణు తెలిపారు.

Related Posts

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Prabhas : ‘ది రాజాసాబ్’ హై అలర్ట్.. మేలో అదిరిపోయే సర్ ప్రైజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’ మూవీ తర్వాత ఓకే చేసిన ఫస్ట్ సినిమా ‘ది రాజాసాబ్ (The Raja Saab)’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపుగా పూర్తైంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ అకస్మాత్తుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *