Mana Enadu : మంచు విష్ణు నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో భారతీయ ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తున్నారు. మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తున్న.. ఈ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అగ్ర తారలు నటిస్తున్నారు.
కన్నప్పలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్
మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ముఖేష్ రిషిల ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు. ఈ సినిమాలో ఇప్పటికే మంచు విష్ణు కొడుకు అవ్రామ్ (Manchu Avram) మంచు నటిస్తున్నాడు. ఇక తాజాగా మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు అరియానా, వివియానా కూడా కన్నప్ప సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కన్నప్పలో అరియానా-వివియానా
అరియానా (Ariana), వివియానా (Viviana) పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఈ విషయాన్ని మోహన్ బాబు వెల్లడించారు. “కన్నప్ప సినిమాతో నా మనవరాల్లు అరియానా, వివియానా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందిస్తున్నాను. నటనపై వాళ్లకున్న అభిరుచి చూసి నాకెంతో గర్వంగా ఉంది. పరిశ్రమలో వారికి గుర్తింపు రావాలని ఎంతో మందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నాను.” అని మోహన్ బాబు తన పోస్టులో రాసుకొచ్చారు.
Excited to share the first glimpse of my beloved granddaughters #Ariaana & #Viviana in #Kannappa. It fills me with pride to see their passion come to life on screen. May they continue to shine and inspire! ✨ Happy Birthday my Ari Vivi.❤️#HarHarMahadevॐ @iVishnuManchu… pic.twitter.com/tZAp9GSKAB
— Mohan Babu M (@themohanbabu) December 2, 2024