మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన మూవీ ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు గతంలో చేసిన పలు సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పకడ్బందీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని ప్రభాస్ (Prabhas), అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి పెద్ద స్టార్లను ఒప్పించి ఈ సినిమాలో నటించేలా చేశారు. మంచు విష్ణు గంపెడాశలు పెట్టుకున్న ఈ మూవీ శుక్రవారం (జూన్ 27న) థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా మెప్పించిందా అంటే ఔననే చెప్తున్నారు ప్రేక్షకులు. తిన్నడుగా తనలోని వీరత్వాన్ని చూపించిన మంచు విష్ణు.. భక్తుడినూ ఎమోషన్ పంచారు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన గొప్ప భావోద్వేగాల్ని పండించింది. ప్రభాస్ రాకతో ఈ సినిమా మరో స్థాయికి వెళ్లింది. కన్నప్ప జీవితంలోని భక్తి సారాన్ని పక్కాగా తెరపైకి తీసుకురావడంలో ఈ మూవీ సక్సెస్ సాధించింది. నవతరాన్ని ఆకట్టుకునేలా బలమైన సాంకేతిక హంగులు, భారీ తారాగణంతో ఈ సినిమాని తీర్చిదిద్దారు.

నాస్తికుడి నుంచి శివ భక్తుడిగా రూపాంతరం
అడవీ ప్రాంతంలోని ఓ చిన్న గూడెంలో పుట్టి పెరుగుతాడు తిన్నడు (మంచు విష్ణు). చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి నాథనాథుడు (శరత్‌కుమార్) అన్నీ తానై పెంచుతాడు. అయితే తన చిన్నతనంలో జరిగిన ఓ సంఘటనతో తిన్నడు నాస్తికుడిగా మారిపోతాడు. విలు విద్యలో ప్రావీణ్యం సాధించిన తిన్నడు అక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటాడు. అయితే ఆ గూడేల్లో ఏమైనా ఆపద వస్తే అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారికి ఒకరిని బలిస్తుంటారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తిన్నడు గూడెం నుంచి బహిష్కరణకి గురవుతాడు. అప్పటికే అతడిని ప్రేమించిన నెమలి (ప్రీతి ముకుందన్) అతడితోపాటే వెళుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనలతో తిన్నడు గొప్ప శివ భక్తుడిగా ఎలా మారిపోతాడు. అలా మారిపోవడానికి కారకుడైన రుద్ర ఎవరు? తిన్నడు శివయ్య కోసం ఏం త్యాగం చేశాడు? అతనికి భక్త కన్నప్పగా పేరు ఎలా వచ్చింది అనేది కథ.

ఫస్టాఫ్ కాస్త స్లో.. సెకండాఫ్ సూపర్
సినిమా ఫస్ట్‌హాఫ్‌లో తిన్నడులోని వీరుడిని ఆవిష్కరిస్తే.. సెకండ్ హాఫ్‌లో అతడిలోని భక్తుడిని తెరపై చూపించారు. ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగిసా.. సెకండాఫ్ ఈ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. తిన్నడు బాల్యంతో అసలు కథ మొదలవుతుంది. చిన్నప్పటి తిన్నడుగా మంచు విష్ణు తనయుడు అవ్రామ్ తెరపై సందడి చేశారు. శ్రీకాళహస్తి పురాణాన్ని చెప్పే పాటలో మంచు విష్ణు కుమార్తెలు కనిపిస్తారు. గూడెంలో తిన్నడు జీవితం, అతని సాహసాలు, నెమలి (ప్రీతి ముకుందన్)తో ప్రేమాయణం, మధ్యమధ్యలో పార్వతీ పరమేశ్వరుల ముచ్చట్లతో ప్రథమార్ధం సాగిపోతుంది. విరామానికి ముందు సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చేశాయి.

ప్రభాస్, విష్ణు మధ్య సంభాషణలకు ప్రేక్షకుల విజిల్స్
సెకండాఫ్‌ను మరింత రక్తికట్టించారు. వాయులింగం చుట్టూ తిరిగే ఎపిసోడ్.. తిన్నడు, అతని తండ్రి నేపథ్యంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు మెప్పించాయి. ప్రభాస్, విష్ణు మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులతో విజిల్స్ కొట్టిస్తున్నాయి. క్లైమాక్స్ కథలోని అసలు సిసలు భక్తి కోణాన్ని చూపిస్తుంది. ప్రభాస్ పార్ట్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. మోహన్‌బాబు, మోహన్‌లాల్ కాసేపే కనిపించినా సినిమాపై గొప్ప ప్రభావం చూపిస్తారు. శరత్‌కుమార్ పాత్ర, నటన ఆకట్టుకుంటుంది. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ తన అందం, నటనతో కట్టిపడేసింది. శివపార్వతుల్లా అక్షయ్‌కుమార్, కాజల్ అలరించారు.
రేటింగ్: 3/5
🔱 When Shivatatva awakens, the world moves.
10K+ tickets are being booked every hour on BookMyShow Alone!❤️🔥
🎟️ Book Now: https://t.co/f5pMVUwVN5
Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥#KannappaInCinemas #KannappaMovie #HarHarMahadevॐ@themohanbabu @iVishnuManchu @Mohanlal… pic.twitter.com/m3ppKQ1QUC— NewsToday (@Godapatrika) June 27, 2025






