Women’s Day Special : మెగా ఫ్యామిలీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women’s Day) పురస్కరించుకొని మహిళలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఓ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది.  మెగా ఉమెన్స్‌ పేరుతో ప్రత్యేక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విడుదలైంది.

తల్లి అంజనా దేవితో.. సోదరీమణులు, సోదరుడు నాగబాబుతో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితానికి సంబంధించి ఎన్నో విశేషాలతో పాటు తాను ఈ స్థాయికి రావడంలో ముఖ్య పాత్ర పోషించిన మహిళల గురించి ఆయన షేర్ చేసుకున్నారు. అవేంటో చూద్దామా..?

‘మా అమ్మ అంజనమ్మ (Anjanamma)కు ఐదుగురు పిల్లలం. ఉద్యోగరీత్యా నాన్న బిజీగా ఉంటే.. అమ్మే మమ్మల్ని అందర్నీ చూసుకునేది. గృహిణిగా ఐదుగురు పిల్లలతో అమ్మ చాలా బిజీగా ఉండేది. అందుకే అన్ని పనుల్లో నేను అమ్మకు సాయం చేసేవాడిని. ఇక మా ఇంట్లో అందరికంటే నేనే యాక్టివ్.

మూడేళ్ల వయసులో నేను ఆడుకుంటూ తప్పిపోయాను. అక్కడే ఉన్న ఒకాయన.. నన్ను కొలిమిలోకి తీసుకెళ్లి ఇంట్లో వాళ్లకు కబురు పంపారు. అమ్మ వచ్చేసరికి ఒళ్లంతా మసి పూసుకుని ఉన్నాను. అప్పుడు అమ్మ నన్ను చూసి నేను తన కొడుకు కానని వెళ్లిపోయింది. మళ్లీ అనుమానం వచ్చి దగ్గరకు వచ్చి చూసి అది నేనే అని గుర్తుపట్టింది. ఇక ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లి నన్ను తాడుతో కట్టేసింది.’ అని చిరంజీవి చెప్పారు.

ఇక నాగబాబు మాట్లాడుతూ.. తమ ఇంట్లో పవన్‌ కల్యాణ్‌ స్పెషల్‌ కిడ్‌ అని తెలిపారు. చిన్నప్పటి నుంచి తను సరిగ్గా తినేవాడు కాదని.. దాంతో అమ్మానాన్న వాడిని బాగా గారాబం చేసేవారని చెప్పారు. తనకు నచ్చిన ఫుడ్‌ వండటానికే అమ్మ ఇష్టం చూపించేదని వెల్లడించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *