మెగా హీరో వైష్ణవ్ తేజ్, మోస్ట్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ శ్రీలీల నటిస్తున్న ఆదికేశవ నవంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ కి సంబంధించిన ప్రోమోను వదిలారు. ఊరమాస్ స్టేపులతో దుమ్ములేపారు. మెగా అభిమానులు సినిమా రాక కోసం ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలు నడుమ సినిమా విడుదల కానున్నది.
మెగా హీరో వైష్ణవ్ తేజ్, మోస్ట్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ శ్రీలీల నటిస్తున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని దసరా పండుగ నుంచే మొదలు పెట్టేశారు. హీరో హీరోయిన్లు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. అలాగే మరోపక్క సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ రెండు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి.
గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. ఒక క్వారీ తవ్వకాలకు అడ్డుగా ఉందనే ఉద్దేశంతో ప్రాచీన కాలంనాటి శివాలయాన్ని పడగొట్టడానికి ఒక బిజినెస్ మెన్ ట్రై చేస్తాడు. అందుకు అడ్డుపడిన ఆదికేశవకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ.