మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వసిష్ఠ(Vashista) దర్శకత్వంలో తెరకెక్కనున్న విశ్వంభర(Vishvambara) ఇప్పటికే పూర్తి కాగా, అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక మరోవైపు, దర్శకుడు బాబీ(Bobby)తో కూడా చిరు కొత్త సినిమాను లైన్‌లో పెట్టారు. (ఆగస్టు 22) చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో నెత్తురు, గొడ్డలితో కూడిన యాక్షన్ టచ్ ఉండటంతో, ఇది పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అభిమానులు అంచనా వేస్తున్నారు. పోస్టర్ విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సెప్టెంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, సినిమాటోగ్రఫర్‌గా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని వ్యవహరిస్తారు. హీరోయిన్ ఎవరు, ఇతర ముఖ్య పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అనే విషయాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.






