
“మా ఇళ్లంతా అమ్మాయిలతో నిండిపోయింది. ఎటుచూసినా ఆడవాళ్లే. ఇంట్లో ఉన్నప్పుడు నా మనవరాళ్లు నా చుట్టూ ఉన్నట్లు అనిపించదు. నేనో లేడీస్ హాస్టల్ వార్గెన్ లాగా అనిపిస్తుంది. అందుకే చరణ్ (Ram Charan) ఇప్పటికైనా ఓ అబ్బాయిని కను. నా వారసత్వం కొనసాగాలంటే మనవడు కావాలి. కానీ చెర్రీకి మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమోనని భయంగా ఉంది.” అంటూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. ఈ కామెంట్స్ పై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది.
అసలేం జరిగిందంటే..?
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘బ్రహ్మా ఆనందం (Brahma Anandam)’. ఆర్‌వీఎస్ నిఖిల్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మంగళవారం రోజున హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. ‘బ్రహ్మా ఆనందం’ సినిమా బృందానికి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ వేడుకలో చిరు మాట్లాడుతూ… తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనకు మనవడు కావాలని అన్నారు.
He Said I Don’t Want Another Girl Child, So Disrespectful To Women
I’m Sincerely Requesting @narendramodi Sir To Please Ban @KChiruTweets Padmabhusan & Vibhushan Awards Immediately To Save Our Indian Culture & Femininity 🙏🏻#ChiranjeeviMisogynyUnmasked pic.twitter.com/5IuWcyHXaM
— Smudge (@Okkkaduu) February 12, 2025
చిరంజీవిపై మాస్ ట్రోలింగ్
అయితే చిరంజీవి చేసిన ఈ Sexist కామెంట్స్ (లింగ సంబంధ) ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో చిరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వారసుడే కావాలని కోరుకుంటున్న ఇలాంటి వాళ్లున్న సమాజమంలో మనం బతుకుతున్నాం అంటూ నెటిజన్లు మెగాస్టార్ పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సమాజంలో ఉన్న వ్యక్తి 2025 కాలంలో కూడా పురుషాధిక్యమే కోరుకుంటున్నారని మండిపడుతున్నారు. వారసుడిని కోరువడంలో తప్పేంటని మరికొందరు చిరు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.