BREAKING: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి అస్వస్థత!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తల్లి అంజనాదేవి(Anjana Devi) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇవాళ (ఫిబ్రవరి 21) తెల్లవారుజామున ఆమె అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన హైదరాబాద్‌(HYD)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఉదయం జరిగన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంజనాదేవి ఆరోగ్య ఈ విషయంపై మెగా ఫ్యామిలీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Check out Megastar Chiranjeevi's heartfelt birthday wish to his mother! |  Telugu Movie News - Times of India

అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్న పవన్

ఇదిలా ఉండగా తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న AP డిప్యూటీ సీఎం, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) ఈరోజు కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హైదరాబాద్(HYD) వెళ్లారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా అంజనాదేవి అనారోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల అంజనా దేవి పుట్టిన రోజును మెగా ఫ్యామిలీ(Mega Family) ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే బాలకృష్ణ(NBK) నిర్వహించిన అన్‌స్టాపబుల్ సీజన్4లో రామ్ చరణ్‌ గెస్టుగా వచ్చినప్పుడు కూడా ఆమె వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను అలా చూస్తే చాలా బాధ కలిగింది : అంజనా దేవి -  Telugu News | JanaSena Party release promo video of interview with AP  Deputy CM Pawan Kalyan mother Anjana Devi | TV9 Telugu

Related Posts

సొంతగడ్డపై సన్‘రైజర్స్’.. రాజస్థాన్‌పై 44 రన్స్‌ తేడాతో గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…

Sikindar: ‘సికిందర్’ ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ లుక్‌లో సల్మాన్‌భాయ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్(Salman Khan), ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(A.R. Murugadoss) కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సికిందర్(Sikindar)’. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తోంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్(Kajal Agarwal)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *