Mana Enadu: మరో టాలీవుడ్(Tollywood) హీరోయిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ మేఘా ఆకాష్(Megha Akash) తన ప్రియుడు సాయి విష్ణు(Sai Vishnu)ని పెళ్లి(Marriage) చేసుకుంది. ఇటీవల వీరిద్దరూ నిశ్చితార్థం(Engagement) చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా తన స్నేహితుడు సాయి విష్ణుతో మేఘా ఆకాష్ రిలేషన్‌లో ఉంది. ఇక వారి పెళ్లికి ఇరుకుటుంబాల(Both Families) సభ్యులు ఒప్పుకోవడంతో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఈరోజు ఒక్కటైంది. చెన్నైలో వీరిద్దరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ సెలబ్రేషన్స్(Celebrations)కు సంబంధించిన ఫొటోస్(Photos) సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా శనివారం పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన రిసెప్షన్(Reception)కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
చైన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్
ఇదిలా ఉండగా చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల కోసం శనివారం చైన్నై(Chennai)లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(Tamilnadu CM MK Stalin), ఆయన తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(Minister Udayanidhi Stalin)తో హాజరై మేఘా-విష్ణును ఆశీర్వదించారు. వధువరులతో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఫ్యాన్స్, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మేఘా ఆకాశ్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నరు. మనుచరిత్ర, రావణాసుర, గుర్తుందా శీతాకాలం, డియర్ మేఘ, రాజ రాజ చోర, ఛల్ మోహన్ రంగా, తూటా, పేట, లై వంటి సినిమాల్లో తన నటనతో తెలుగు అభిమానులను అలరించింది.