Micro Plastic: పెరుగుతున్న మైక్రో ప్లాస్టిక్ ముప్పు!

ManaEnadu: ప్రస్తుతం వివిధ వస్తువుల తయారీకి ప్లాస్టిక్‌(Plastic)ను అధికంగా వినియోగిస్తున్నాం. ఇలా తయారైన ప్లాస్టిక్ వస్తువుల్లో అనేక రకాల ఆహార పదార్థాలు(Food Items), పానీయాల(Drinks)ను నిల్వచేస్తున్నాం. వీటిలో ఆహారం, పానీయాలు తీసుకున్నప్పుడు.. ఈ వస్తువుల తయారీకి వాడిన ప్లాస్టిక్ లోని అతి చిన్న రేణువులు ఆహారంతో పాటు శరీరంలోని వివిధ భాగాలకు చేరుతున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన అనేక అధ్యయనా(Research)ల్లో మనిషి ముక్కు, ఊపిరితిత్తులు(Lungs), కాలేయం, పురుషాంగం, మానవ రక్తం, మూత్రం, తల్లిపాలలో కూడా మైక్రో ప్లాస్టిక్(Micro plastic) ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ మైక్రో ప్లాస్టిక్ ఏ ఆహార పదార్థాల వల్ల శరీరంలోకి ఎక్కువగా చేరే అవకాశం ఉందో తెలుసుకుందాం.

 వాటర్ బాటిళ్ల వినియోగం తగ్గించాలి

మనం నీరు తాగడానికి ఎక్కువగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల(Plastic Water Bottles)ను వాడుతుంటాం. అలాగే వాటర్ కేన్స్ లో ఉండే నీటినే ఇంట్లో వినియోగిస్తుంటాం. వీటిలో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు వాటర్ బాటిల్ తయారీకి వాడే ప్లాస్టిక్ లోని కణాలు నీరు ద్వారా శరీరంలోకి చేరుతున్నాయి. అందుకే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగం తగ్గించాలి. ఈ మధ్య టీ బ్యాగ్‌ల వినియోగం ఎక్కువైంది. అయితే వీటి తయారీకి పలుచని ప్లాస్టిక్ బ్యాగుల(Plastic bags)ను వినియోగిస్తారు. ఈ బ్యాగులను వేడిగా ఉండే నీటిలో ముంచినప్పుడు అవి అధిక ఉష్ణోగ్రత వద్ద హానికరమైన మైక్రో ప్లాస్టిక్ పదార్థాలను విడుదల చేస్తున్నట్లు, అవి శరీరంలోని అనేక కణాల్లోకి చేరుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

 అందుకే బియ్యాన్ని ఎక్కువసార్లు కడగాలి..

మనం ఇంట్లో వాడే బియ్యా(Rice)న్ని ఎక్కువగా ప్లాస్టిక్ బ్యాగులలోనే నిల్వ ఉంచుతాం. ఇలా ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు ఆ బ్యాగు తయారీకి వాడే ప్లాస్టిక్ లోని మైక్రోప్లాస్టిక్‌(Microplastic particles) కణాలు బియ్యంలో చేరుతాయి. వీటిని వండుకొని తినేటప్పుడు ఈ మైక్రో ప్లాస్టిక్ అన్నంతో పాటు శరీరంలోకి చేరుతుందని గుర్తించారు. అందుకే బియ్యాన్ని వండే ముందు ఎక్కువసార్లు కడగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో నిత్యం ఉపయోగించే చక్కెర, ఉప్పు రెండిట్లోనూ మైక్రో ప్లాస్టిక్ స్వల్ప పరిమాణంలో ఉన్నట్టు గుర్తించారు. సముద్రపు నీటితోనే ఉప్పును తయారు చేస్తారు. అయితే ఆ నీటిలో మైక్రో ప్లాస్టిక్ అధికంగా చేరడంతో ఉప్పులో కూడా అవి కలుస్తున్నట్లు ‘టాక్సిక్స్ లింక్(Toxics link)’ అనే సంస్థ జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Share post:

లేటెస్ట్