Rythu Bandhu : రైతు బంధు డబ్బు జమపై మంత్రి సీత‌క్క కీల‌క‌ ప్రకటన!

మ‌న ఈనాడుః రైతు బంధు నిధుల విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. పెద్ద ఫామ్ హౌస్ లకు రైతు బంధు పడలేదని ఎమ్మెల్యే హరీష్ రావు బాదపతున్నారని చురకలు అంటించారు. సీఎం సమీక్షించిన తరువాత రైతు బంధు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ పంచాయతీ రాజ్‌, మహిళ, శిశు సంక్షేమం మంత్రి సీతక్క రైతు బంధు నిధులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుంది.. రైతులకు బోనస్ ఇస్తాం అని ఎన్నికల సమయంలో చెప్పారు.. వడ్లకు రూ.500 బోనస్ ఎప్పుడు ఇస్తారు? వడ్లు కొనుగోలు ఎప్పుడు చేస్తారు? చెప్పాలి అని అడుగుతున్నాం .. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను అడుగుతున్నాం’ అని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై సీతక్క స్పందించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పెద్ద ఫామ్ హౌస్ లకు రైతు బంధు పడలేదని ఎమ్మెల్యే హరీష్ రావు బాదపతున్నారని సెటైర్లు వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు నియమావళిని ఇష్టానుసారంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన తరువాత తెలంగాణ రైతులకు రైతు బంధు నిధులను వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క.

కేసీఆర్ పాలనలో విద్యుత్ శాఖను అప్పులకుప్పగా చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని పోనివ్వమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండు రోజులే అయిందని ప్రతిపక్ష నేతలకు గుర్తు చేశారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను అమలు చేశామని.. మిగతా హామీలను త్వరలోనే నెరవేరుస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.

Share post:

లేటెస్ట్