Modi 3.0: దేశంలో NDA దురహంకారం ఇక పనిచేయదు.. మోదీ 3.0 ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

Mana Enadu: దేశంలో ప్రస్తుతం యూ టర్న్(U-Turn) ప్రభుత్వం నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతె(Congress National Spokesperson Supriya Srinathe) అన్నారు. ప్రభుత్వ దురహంకారం ఇక పని చేయదని స్పష్టమైందని ఆమె పేర్కొన్నారు. దేశంపై ప్రభావం చూపే NDA, మోదీ(Modi) ప్రభుత్వ నిర్ణయాలు ఇకపై చట్టంగా మారే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు, ప్రజల ఒత్తిడికి ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. లేటరల్ ఎంట్రీలు, వ‌క్ఫ్ బోర్డు, బ్రాడ్‌కాస్టింగ్ బిల్లు, పెన్షన్ స్కీంల‌పై ప్రభుత్వం యూట‌ర్న్ తీసుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

 వంద రోజుల్లో 38 రైల్వే ప్రమాదాలు

ఇదిలా ఉండగా మోదీ 3.0 ప్రభుత్వంపై కాంగ్రెస్(Congress) జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతె తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడోసారి అధికారం చేపట్టిన మోదీ గవర్నమెంట్ గత 100 రోజుల్లో భారతీయ రైల్వేల(Indian Railways)ను నాశనం పట్టించిందని ఆమె దుయ్యబట్టారు. వంద రోజుల్లో 38 రైల్వే ప్రమాదాలు(Train Accidents) జరిగాయని, ముఖ్యంగా బాలాసోర్ రైల్వే దుర్ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె మండిపడ్డారు. ఈ ప్రమాద ఘటనతోనైనా కేంద్రం గుణపాఠాలు నేర్చుకుంటుందని అంతా భావించినా ఇప్పటికీ అలాంటి ఘటనలే జరుగుతున్నాయని అన్నారు. రైల్వే ప్రమాదలకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnav) పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

 3 నెలల్లో రూ.15లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు

కాగా PM మోదీ నేతృత్వంలో NDA మూడోసారి అధికారం చేపట్టి మంగళవారం నాటికి 100 రోజులు పూర్తికానున్నాయి. గ‌త 3 నెల‌ల్లో రైలు, రోడ్డు, పోర్ట్‌, విమాన‌యాన రంగా(Aviation sector)ల్లో రూ.15 ల‌క్షల కోట్ల విలువైన ప్రాజెక్టు(Projects)లు ప్రారంభించామ‌ని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 25వేల గ్రామాల‌కు రోడ్డు నిర్మాణానికి సాయంగా రూ.49 వేల కోట్ల నిధుల పంపిణీ చేశామని పేర్కొంది. మరో రూ.50 వేల కోట్ల పెట్టుబడితో రోడ్ నెట్‌వర్క్‌(Road network)ను బలోపేతం చేసే ప్రాజెక్టులను ఆమోదించినట్టు కేంద్రం వెల్లడించింది. దీంతోపాటు 936 కిలోమీటర్ల మేర ఎనిమిది జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్(High-speed road corridor) ప్రాజెక్టులతో సహా నేషనల్ రోడ్లను అనుసంధానం చేసే నెట్ వర్క్‌ను బలోపేతం చేసేందుకు కేంద్ర ఆమోదం తెలిపింది.

Share post:

లేటెస్ట్