ManaEnadu:కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికిస్తోంది. దానిపేరే మంకీపాక్స్ (ఎంపాక్స్). ఆఫ్రికా దేశంలో పుట్టి ఆ దేశాల్లో వ్యాపిస్తూ ప్రపంచ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇక తాజాగా మన పొరుగుదేశమైన పాకిస్థాన్ కూ చేరింది. ఈ నేపథ్యంలో భారతదేశం అప్రమత్తమైంది. అయితే అసలు మంకీపాక్స్ అంటే ఏంటి? దీని లక్షణాలేంటి? ఎలా వ్యాపిస్తుంది? తెలుసుకుందాం రండి.
మంకీపాక్స్ ను క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్), క్లాడ్-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్) అనే రెండు వేరియంట్లుగా డివైడ్ చేశారు. క్లాడ్-1 సోకితే న్యూమోనియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు.. క్లాడ్-2 వ్యాపిస్తే.. శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్లాడ్-1 ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
మంకీపాక్స్ నేరుగా తాకడం వల్ల, నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల వ్యాపిస్తుంది. రోగులు వాడిన దుస్తులు వాడటం వల్ల సోకుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న క్లాడ్-1 ఐబీ వేరియంట్ లైంగిక సంబంధాల కారణంగా వ్యాపిస్తున్నట్లు సమాచారం.
మంకీపాక్స్ లక్షణాలు ఇవే..!:
ఈ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.
పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ
కొంతమందికి నోరు, కళ్లు, గొంతు, ప్రైవేట్ భాగాలపై పొక్కులు రావడం.