రిలీజైన కొత్త సినిమాలకు భిన్న రీతిలో ‘బ్రో’ అంటూ తనదైన ప్రాసలతో రివ్యూలు ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు యూట్యూబర్ లక్ష్మణ్ టేకుముడి (Lakshman Tekumudi). ఓ వైపు జబర్దస్త్లో కనిపిస్తూనే సినిమాల్లో బిజీగా మారాడు. ఇప్పుడు ఏకంగా హీరోగా అవకాశం దక్కించుకున్నాడు. ఆయన హీరోగా ది విండో (The Window) అనే ఓ కొత్త థ్రిల్లర్ చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ నిత్య శ్రీ (nityasri) కథానాయిక. గతంలో వచ్చిన ‘కొంచెం హట్ కే’ సినిమాకు దర్శకత్వం వహించిన అవినాష్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
రివ్యూలు చెప్తూ పాపులారిటీ..
భిన్నమైన రీతిలో రివ్యూలు చెప్తూ పాపులారిటీ తెచ్చుకున్న లక్ష్మణ్ సీరియల్స్ లో అవకాశం దక్కించుకున్నాడు. ఆపై గత రెండేండ్లుగా సినిమాలు కూడా చేస్తూ బిజీగా మారాడు. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ మూవీస్, సిరీస్‌లు చేస్తున్నాడు. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో ఆయనకు ఫ్రెండ్‌గా కనిపించాడు. ఇప్పుడు హీరోగా కనిపించనున్నాడు.






