తాజాగా నరేష్ తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. నరేష్ 63వ సినిమా ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో, హాస్య మూవీస్ నిర్మాణంలో ప్రకటించారు.
అల్లరి నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ‘నాంది’ సినిమా నుంచి వైవిధ్యమైన కథలతో, వైవిధ్యమైన టైటిల్స్ తో వస్తున్నాడు. ఇన్నాళ్లు కామెడీతో అందర్నీ నవ్వించిన అల్లరి నరేష్ నాంది నుంచి తనలోని ఎమోషన్ ని, సీరియస్ నటుడ్ని చూపిస్తున్నాడు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ కొట్టిన అల్లరి నరేష్ త్వరలో ‘సభకు నమస్కరం’ అనే సినిమాతో రాబోతున్నాడు.
ప్రస్తుతం సభకు నమస్కారం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా నరేష్ తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. నరేష్ 63వ సినిమా ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో, హాస్య మూవీస్ నిర్మాణంలో ప్రకటించారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అలాగే నరేష్ 63వ సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
నరేష్ 63వ సినిమాకు ‘బచ్చలమల్లి'(Bachhala Malli) అనే సరికొత్త టైటిల్ ప్రకటించారు. ఈ పోస్టర్ లో ట్రాక్టర్ మీద నుంచి కొన్ని బస్తాలు ఎగిరి పడుతున్నట్టు ఉంది. ఇది కూడా నరేష్ ఇటీవల చేస్తున్న సినిమాల్లాగే ఉండొచ్చు అనిపిస్తుంది. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం జరగగా దర్శకుడు మారుతీ, అనిల్ రావిపూడి అతిథులుగా వచ్చారు. మరి ఈ ‘బచ్చలమల్లి’ సినిమాతో నరేష్ ఎలా మెప్పిస్తాడా చూడాలి.