Bigg Boss 7 Day 88 : ప్రస్తుతం ఎనిమిది కంటెస్టెంట్స్ తో రన్ అవుతున్న తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7.. ఫినాలే దగ్గర పడడంతో హోరాహోరీగా జరుగుతుంది. మరో రెండు వారల్లో ఫినాలే ఉండడంతో.. ఇప్పటి నుంచే మొదటి ఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేసే ప్రక్రియ నడుస్తుంది. ఈక్రమంలోనే ‘టికెట్ టూ ఫినాలే’ అంటూ పలు టాస్క్ లు ఇస్తూ వస్తున్నాడు బిగ్‌బాస్. మంగళవారం ఈ రేస్ నుంచి శివాజీ, శోభా ఎలిమినేట్ అవ్వగా, బుధవారం ప్రియాంక కూడా ఎలిమినేట్ అయ్యింది. ఇక గురువారం ఎపిసోడ్ కూడా మరికొన్ని టాస్క్ లతో పోటీపోటీగా సాగింది.
మొదట క్రికెట్ గేమ్ టాస్క్ ఇవ్వగా.. అమర్ ఫస్ట్ ప్లేస్ ని సొంతం చేసుకున్నారు. అర్జున్, ప్రశాంత్, తరువాత రెండు స్థానాల్లో నిలిచారు. ఇక రెండో టాస్క్ ‘తప్పింకుచో రాజా’లో రైతుబిడ్డ అదరగొట్టగా.. అమర్ దీప్, యావర్ తరువాత స్థానాల్లో నిలిచారు. అయితే ఈ టాస్క్ లో అమర్ చేసిన పనికి యావర్ కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టాస్క్ లో కాళ్ళకి చైన్ తో లాక్ వేసి ఉంటుంది. వాటిని కీ ద్వారా విడిపించుకోవాల్సి ఉంటుంది. ప్రశాంత్, అమర్ ఒకరి తరువాత ఒకరు లాక్ తీసుకున్నారు. అయితే అమర్ తన లాక్ తీసిన తరువాత కీని గందరగోళంగా పడేయడంతో యావర్ కి కష్టం అయ్యింది.
దీంతో యావర్ తక్కువ మార్కులతో రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక తన దగ్గర ఉన్న పాయింట్స్ ని పల్లవి ప్రశాంత్ కు ఇచ్చాడు. ప్రస్తుతం ‘టికెట్ టూ ఫినాలే’ రేసులో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, అర్జున్, గౌతమ్ ఉన్నారు. వీరిలో అమర్, ప్రశాంత్ తో పాటు అర్జున్ కూడా గట్టి పోటీ ఇస్తూ ఫినాలే రేసులో అదరగొడుతున్నారు. ఈరోజు టాస్క్ లతో మొదటి ఫైనలిస్ట్ ఎవరు అన్నది తేలిపోతుంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో శివాజీ, గౌతమ్, యావర్, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, శోభా శెట్టి నిలిచారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ పార్టీ.. ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా…