ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas) వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భారత్‌లోనూ చర్చిలు, ఇండ్లలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సెలబ్రిటీలు సైతం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కూడా తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంబరాలు జరుపుకున్నాడు. భార్య సాక్షి, కూతురు జీవా, బాలీవుడ్ నటి కృతిసనన్, కభీర్ బహియా తదితరులు పాల్గొన్న ఈ సెలబ్రేషన్స్‌లో.. ధోనీ (Dhoni) శాంటాక్లాజ్ (santa claus) వేషధారణలో సందడి చేశాడు. మిగతా వాళ్లు శాంటాక్లాజ్టోపీలు ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సాక్షి సోషల్ మీడియాలో షేర్చేసింది. వాటిని చూసిన ధోనీ ఫ్యాన్స్..శాంతాక్లాజ్ గెటప్‌లో తమ అభిమాన క్రికెటర్సందడి చేయడం చూసి ఖుష్అవుతున్నారు.
2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్లో (IPL) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడుతున్నాడు. రోహిత్ శర్మ తర్వాత ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనీ. ఐపీఎల్ 2025 కోసం గత నెలలో నిర్వహించిన వేలంలో చెన్నై సూపర్‌కింగ్స్ రిటైన్ చేసుకున్న ఐదుగురు ఆటగాళ్లలో ధోనీ ఒకరు.
View this post on Instagram








