
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో వస్తున్న SSMB29 మూవీ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రబృందం ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల చూపంతా ఈ సినిమాపైనే. నెటిజన్లు వేయి కళ్లతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
SSMB29పై కీరవాణి అప్డేట్
ఈ చిత్రం గురించి చిన్న అప్డేట్ వినిపించినా సరే మహేశ్ బాబు అభిమానులు నెట్టింట దాన్ని తెగ వైరల్ చేసేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడినా అందరూ ఆవైపే చూస్తున్నారు. దాని గురించే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ షేర్ చేసుకున్నారు. ‘నా టూర్ ఎంఎంకే (Na Tour MMK)’ అనే ఈవెంట్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఈ టూర్ కోసం కీరవాణి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా మహేశ్ బాబు, జక్కన్న సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ పంచుకున్నారు.
And that’s a wrap for ~ Action Sequence Done ✅ #SSMB29 🎬✨@urstrulyMahesh 🦁🔥
Truly a privilege to witness the magic unfold. Grateful for the journey and beyond excited for what’s next @ssrajamouli !
~ 💃🕺🧨 The shoot is going on a full swing✨@priyankachopra @ssk1122 pic.twitter.com/MrzRT47QRL— Odisha MAHESH FC™🌍 (@OdishaMaheshFC) March 18, 2025
ఇలాంటి సినిమా రాలేదు
SSMB29 లాంటి సినిమా ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నడూ రాలేదంటూ కీరవాణి (Keeravani On SSMB29) ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేశారు. చాలా క్లిష్టమైన కథతో కఠినమైన ప్రాజెక్టుతో మహేశ్, రాజమౌళి ప్రేక్షకులకు థ్రిల్ పంచేందుకు వస్తున్నారని తెలిపారు. ఎన్నో సినిమాలకు పని చేసిన తనకు ఈ మూవీకి పని చేయం మాత్రం ఛాలెంజింగ్ మారిందని వెల్లడించారు. ఇలాంటి సినిమా ఎప్పుడూ రాలేదు కాబట్టి కొత్త ట్యూన్స్, మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నట్లు వివరించారు. రాజమౌళి మరో అద్భుత ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడంటూ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు కీరవాణి. ఇక ఇప్పుడు కీరవాణి కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.