
కోలీవుడ్ హీరో, తమిళ వెట్రికజగం పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) పై కేసు నమోదైంది. ఇఫ్తార్ విందును అవమానించారంటూ సున్నత్ జమాత్ అనే ముస్లిం సంఘం ప్రతినిధులు చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు విజయ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై ఈ హీరో టీమ్ ఇంకా స్పందించలేదు.
అసలేం జరిగిందంటే..?
ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ప్రజల్లోకి వెళ్లడంలో భాగంగా ముస్లిం పెద్దలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ సందర్భంగా చెన్నైలోని రాయపేట వైఎంసీఏ మైదానంలో నిర్వహించిన విందులో.. ఉపవా సం ముగించే సమయంలో విజయ్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అయితే ఈ విందులో కొందరు తాగుబోతులు, ఉపవాసం లేని వారు పాల్గొన్నారని సున్నత్ జమాత్ అనే ముస్లిం సంఘం ప్రతినిధులు ఆగ్రహించారు.
విజయ్ మీద ఫిర్యాదు
.. ఎంతో పవిత్రమైన ఇఫ్తార్ విందును విజయ్ ఇలా అందరినీ పిలిచి అవమానించారంటూ ముస్లిం పెద్దలు మండిపడ్డారు. మరోవైపు కొంతమంది బాడీగార్డ్స్ అక్కడి ముస్లిలను నెట్టేశారని.. విందుకు పిలిచి ఇలా ప్రవర్తించడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తమ మనోభావాలు దెబ్బతీశాడంటూ విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.