ఇంగ్లండ్(England)తో జరుగుతున్న ఐదో టెస్టు(Fifth Test) తొలిరోజు ఆటలో భారత్(Team India) తడబడి నిలబడింది. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్(Oval) వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ స్టంప్స్ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (52 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించగా, వాషింగ్టన్ సుందర్ (19 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 51 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేశారు. పచ్చిక పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగారు. దీంతో భారత బ్యాటర్లు వరుస విరామాల్లో పెవిలియన్ చేరారు.
A thrilling day of Test cricket at The Oval 💫#WTC27 #ENGvIND pic.twitter.com/nn3FCgbMMo
— ICC (@ICC) July 31, 2025
పెవిలియన్‌కు క్యూ కట్టారు
ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) త్వరగా ఔటయ్యారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (21) రనౌట్ కాగా, సాయి సుదర్శన్ (38), రవీంద్ర జడేజా (9), ధ్రువ్ జురెల్ (19) కీలక సమయంలో డగౌట్‌కు చేరారు. గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు తీయగా, వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. అయితే, జామీ ఓవర్టన్, టంగ్‌లు కొన్ని ఓవర్లలో నియంత్రణ కోల్పోయారు. క్రిస్ వోక్స్(Chris Woaks) భుజం గాయం కారణంగా ఆట నుంచి తప్పుకోవడం ఇంగ్లండ్‌కు ఆందోళన కలిగించింది. పిచ్‌లో 8mm గడ్డి ఉండటం, ఓవర్‌కాస్ట్ వాతావరణం సీమ్ బౌలర్లకు సహకరించాయి. భారత బ్యాటర్లు కఠిన పరిస్థితుల్లో పోరాడారు. నాయర్(Nair) ఓపికగా ఆడుతూ జట్టును ఆదుకున్నాడు.
కరుణ్.. తొమ్మిదేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ
కాగా 2016లో ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ మరో మైలురాయి కోసం తొమ్మిదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. కాగా ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన నాయర్.. నాలుగో టెస్టుకు దూరమయ్యారు. అనూహ్యంగా వచ్చిన మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. రెండో రోజు అతడు ఎంతసేపు క్రీజులో ఉంటాడనే దానిపైనే భారత స్కోరు ఆధారపడి ఉంది. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా, భారత్ సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాల్సిందే.
A long awaited comeback!
303*, 26, 0, 23, 5, 0, 20, 31, 26, 40, 14, 12… and finally:
52* today at The Oval! 💪First Test fifty after 3,149 days & 11 innings on a tricky pitch and in a series decider match.
Man of the hour KARUN NAIR. 🔥pic.twitter.com/gvHDIfKyma
— Raw Cricket Talks (@RawCricketTalks) July 31, 2025






