నారా లోకేష్​ ఎఫెక్ట్​..జైల్లో ఏం జరిగిందంటే..?!

రాజమండ్రి సెంట్రల్​ జైలు సూపరిటెండెంట్​ రాహుల్​ ఒక్కసారిగా ధీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లారు. కోస్తాంద్ర జైళ్లశాఖ డీఐజీగా ఉన్న రవికిరణ్​ను తీసుకొచ్చి రాజమండ్రి జైలుకు ఇంఛార్జీ బాధ్యతలు అప్పిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రాజమండ్రి జైలు సూపరింటెండెంట్​ రాహుల్​ను బలవంతంగా సెలవు పెట్టించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతుంది.

పోలీసులు చేతిలో ఉండాల్సిన లాఠీలు..జైలు అధికారులు మధ్య ఉండటాన్ని చూసి నారా లోకేష్​ జైలు అధికారులపై సీరియస్​ అయ్యారు. ఇది జరిగిన గంటల సమయంలోనే జైలు సూపరింటెండెంట్​ సెలవు వెళ్లడాన్ని ప్రభుత్వం మాజీ సీఎం చంద్రబాబు జైలు లోపల కుట్రకు తెరతీసిందని టిడిపి శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు.

చంద్రబాబు అరెస్టు విషయంలో గవర్నర్​తోపాటు ఎన్​ఎస్​జీ దళాల ఛీప్​ అనుమతి తప్పనిసరి. కానీ ఇవేమి పాటించకుండా అక్రమంగా అరెస్టు చేయడంతో చంద్రబాబు ప్రాణహాని పొంచిఉందని తెలుగుదేశం నాయకలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీ రఘరామకృష్ణంరాజు వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న దోరిణిపై మండిపడ్డారు. బలవంతంగా రాహుల్​ను తప్పించి రవికిరణ్​కు రాజమండ్రి జైలు బాధ్యతలు అప్పగించడం భారీ కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పటికే జైళ్ల ఎదుటు పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు, నాయకులు జైలులో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.

MP Raghurama Krishnam Raju complains to police against YSRCP MLAs

Share post:

లేటెస్ట్