OG: పవన్ ‘ఓజీ’లో నటించిన నారా రోహిత్కు కాబోయే భార్య

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘ఓజీ’ (OG). ప్రియాంక అరుల్‌ మోహన్‌ (Priyanka Mohan) హీరోయిన్. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్ రోల్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమాలో నటుడు నారా రోహిత్‌కు (Nara Rohith) కాబోయే సతీమణి శిరీషా లెల్లా నటిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా స్వయంగా నారా రోహితే వెల్లడించారు. ‘భైరవం’ మూవీ ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడారు.

 

‘ఓజీ’ మూవీ షూటింగ్‌ శరవేగంగా..

 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నారా రోహిత్‌, మంచు మనోజ్‌ (Manoj Manchu) నటించిన సినిమా ‘భైరవం’ (Bhairavam). ఈ సినిమా ప్రచారంలో భాగంగా టీమ్‌ మొత్తం సాయి దుర్గా తేజ్‌తో (Sai Durga Tej) కలిసి సరదా ఇంటర్వ్యూ చేశారు. ‘ఓజీ’ అప్‌డేట్‌ చెప్పాల్సిందిగా నారా రోహిత్‌ను సాయి దుర్గాతేజ్ అడగ్గా.. ‘ఇందులో నాకు కాబోయే భార్య శిరీషా నటించింది. ‘ఓజీ’లో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం తనకు దక్కింది’ అని స్పష్టం చేశారు. ‘ఓజీ’ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *