Pre Release Event: ఇలాంటి సినిమాలే ఇండస్ట్రీని నడిపిస్తాయి.. ‘నరుడి బ్రతుకు నటన’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సుధీర్‌బాబు

Mana Enadu: శివకుమార్‌ రామచంద్రవరపు, నితిన్‌ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన(Naruḍi bratuku naṭana)’. శృతి జయన్‌, ఐశ్వర్య అనిల్‌ కుమార్‌, వైవా రాఘవ్‌ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతోన్న ఈ చిత్రానికి రిషికేశ్వర్‌ యోగి దర్శకత్వం వహించారు. TG విశ్వ ప్రసాద్‌, సుకుమార్‌ బోరెడ్డి, డాక్టర్‌ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. సుధీర్‌ కుమార్‌ ప్రాజెక్ట్‌ హెడ్‌. ఈ మూవీ అక్టోబర్‌ 25న రాబోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌(Pre Release Event) నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సుధీర్‌ బాబు(Sudheer Babu), దర్శకులు వీరశంకర్‌, వీజే సన్నీ, శ్రీరామ్‌ ఆదిత్య, వితిక షెరు వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 మూవీని అద్భుతంగా తీశారు: సుధీర్ బాబు

సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘శివ, నితిన్‌ ప్రసన్న ఎంతో ఇంటెన్స్‌(Very intense)గా నటించారు. నా చిత్రంలో ఏదైనా మంచి పాత్రలుంటే వారినే రిఫర్‌ చేయాలని అనుకుంటున్నాను. రిషి ఈ మూవీని అద్భుతంగా తీశాడు. పెద్ద సినిమాలే కాదు.. చిన్న చిత్రాలు, మీడియం చిత్రాలే ఇండస్ట్రీని నడిపిస్తాయి. అక్టోబర్‌ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్‌(Success) చేయండి’ అని కోరారు.

 కేవలం డబ్బుంటే సినిమాలు తీయలేం: TG విశ్వప్రసాద్‌

ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్‌(TG Vishwaprasad) మాట్లాడుతూ.. ‘ప్యాషన్‌, డబ్బులుంటే సినిమాల్ని తీయలేం. నేను ప్రారంభంలో కొన్ని చిత్రాలను నిర్మించాను. అవి ఇంటర్నేషనల్‌ స్టేజ్‌ మీద ప్రదర్శించగలిగాను. కానీ థియేట్రికల్‌ రిలీజ్‌(Theatrical release) చేయలేకపోయాను. ఈ ‘నరుడి బ్రతుకు నటన’ టీంని చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. అందుకే వారికి సాయం చేయాలని ముందుకు వచ్చాను’ అని అన్నారు.

 వారు లేకుంటే సినిమా ఇలా వచ్చేది కాదు: డైరెక్టర్

డైరెక్టర్ రిషికేశ్వర్ యోగి(Director Rishikeshwar Yogi) మాట్లాడుతూ.. ‘మా సినిమాను టేకప్ చేసిన టీజీ విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్. మా ఈవెంట్‌కు వచ్చిన సుధీర్ బాబుకి, శ్రీరామ్ ఆదిత్య గారికి థాంక్స్. శివ, నితిన్ వంటి యాక్టర్లు లేకపోయి ఉంటే.. ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీంకు థాంక్స్. 25న అందరూ సినిమా చూడండి’ అని అన్నారు. శ్రీరామ్ ఆదిత్య, వీజే సన్నీ, శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న తదితరులు మాట్లాడుతూ.. మేం ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తీశామని, అభిమానులు ఆదరించాలని కోరారు.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

Pawan Kaiyan: భారీ ధరకు హరిహర వీరమల్లు ఓటీటీ డీల్!

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kaiyan) ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జూలై 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *