తెలుగు ఇండస్ట్రీ(Telugu Industry)లో ఇటీవల కాలంలో ఓల్డ్ చిత్రాల రీరిలీజ్ ట్రెండ్(Rerelease trend) నడుస్తోంది. ఇది ఆయా సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే వీటి ప్రభావం కొత్తగా విడుదలయ్యే మూవీలపై పడుతోందని పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి సినిమా తీసి, అందుకు తగ్గట్లుగానే ప్రమోషనల్ కార్యక్రమాలు(Promotional Events) చేపడుతున్నా.. జనం అస్సలు పట్టించుకోవడం లేదని, అసలు థియేటర్ల వైపే రావడం లేదని అంటున్నారు. దీంతో కలెక్షన్లు(Collections) రాకపోగా.. దారుణ నష్టాలను చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు.
పాత సినిమాలకూ జోరుగా ప్రచారం
ఇక ఇటీవల కాలంలో గబ్బర్ సింగ్(Gabbar Singh), ఖుషి, ఆది, ఖలేజా, ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోక సుందరి, అతిథి, ఢీ, అతడు, వెంకీ(Venky), మురారి, సై, ఇంద్ర, విక్రమార్కుడు, మాస్ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు సినిమాలు థియేటర్లలో గ్రాండ్‌గా రీరిలీజ్ అయ్యాయి. వీటికీ హేవీగానే ప్రమోషన్స్ నిర్వహించారు. వీటి ప్రభావం కొత్తగా వచ్చిన చిన్న సినిమాలపై అధికంగా పడిందని ఆయా సినిమాల నిర్మాతలు అంటున్నారు.

రీరిలీజ్‌లో ఖలేజాకు రూ.4 కోట్ల పైగా కలెక్షన్స్?
అంతెందుకు మొన్నటి మొన్న మే 30న మంచు మనోజ్(Manchu Manoj) నటించిన ‘భైరవం(Bhairavam)’ మూవీతోపాటు మహేశ్ బాబు(Mahesh Babu) నటించిన పాత సినిమా ‘ఖలేజా(Khaleja)’ ఒకేరోజు థియేటర్లలోకి వచ్చాయి. పైగా దీనికి 20 రోజుల ముందు నుంచే రీరిలీజ్ అంటూ విపరీతంగా ప్రచారం కల్పించారు. దీంతో ఈ మూవీకి రీరిలీజ్‌లో రూ.4 కోట్ల పైగా కలెక్షన్స్(Collections) కొల్లగొట్టింది. అటు కొత్త సినిమా అయిన ‘భైరవం’ మూవీకి మొదటి రోజు అందులో సగం కూడా రాలేదు.

ఆ సమయంలో రీరిలీజ్‌లు వద్దని డిమాండ్
నిజానికి “భైరవం” సినిమాకి భారీగా ప్రచారం చేశారు. అయినా అటెన్షన్ అంతా “ఖలేజా” వైపు వెళ్లింది. ఇలా ఇదొక్కటే కాదు ఇదే తరహాలో చాలా కొత్త సినిమాలు నష్టపోయాయి. దీంతో కొత్త సినిమాల సమయంలో పాత సినిమాలు రీరిలీజ్ చేయకూడదనే డిమాండ్ వస్తోంది. ఇంకో విచిత్రం ఏంటంటే జనం కొత్త సినిమాలను 4 వారాలు ఆగి OTTలో చూస్తున్న జనం.. పాత సినిమాలను మాత్రం థియేటర్లో చూస్తున్నారు.






