Robinhood : ఓటీటీలోకి ‘రాబిన్‌హుడ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ యంగ్ హీరోకు అవకాశాలు వస్తున్నాయి. భీష్మ చిత్రం తర్వాత నితిన్ కు చెప్పుకోదగ్గ హిట్లు లేవు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా.. అవి ప్రేక్షకులను అలరించడంలో మిశ్రమ ఫలితాలు చవిచూస్తున్నాయి. ఇక ఇటీవల నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రాబిన్ హుడ్ (Robin Hood)’ . శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

డేవిడ్ భాయ్ కూడా వర్కవుట్ కాలేదు

ఉగాది కానుకగా మార్చి 28వ తేదీన రాబిన్ హుడ్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఇందులో ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక వార్నర్ రాకతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ టీమ్ ప్రమోషన్లు కూడా ఓ రేంజులో చేయడంతో ఈ మూవీ పక్కా హిట్ అవుతుందని అంతా భావించారు. కానీ రొటీన్ స్టోరీ, డేవిడ్ వార్నర్ పాత్రను పూర్తిగా చూపించకపోవడం వంటి కారణాలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది.

మే2న ఓటీటీలోకి రాబిన్ హుడ్

ఇక థియేటర్లో మిశ్రమ ఫలితాలు దక్కించుకున్న రాబిన్ హుడ్ (Robin Hood Ott News) మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ హక్కును ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ఈ సినిమా మే 2వ తేదీన ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే థియేటర్లలో విడుదలై నెలరోజుల్లోపే ఈ సినిమా ఓటీటీ వేదికపై అందుబాటులోకి వస్తుందన్నమాట.

Related Posts

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Ram Pothineni: రామ్ కొత్త మూవీ గ్లిమ్స్ వచ్చేసింది.. మూవీ పేరు ఇదే..

రామ్ పోతినేతి (Ram Pothineni), భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) కాంబోలో మహేశ్ బాబు.పి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన సూపర్ అప్డేట్ వచ్చేసింది. రామ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ (Andhra King…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *