NTPCలో జాబ్స్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.. నెలకు 1.4 లక్షల జీతం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా ఉద్యోగం పొందొచ్చు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 475 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ఎలక్ట్రికల్ 135, 180 మెకానికల్, 85-ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్, 50 సివిల్, మైనింగ్ 25 పోస్టులున్నాయి.

అర్హతలు  

  1. ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.
  2. SC/ST/PwBD అభ్యర్థులు 55 శాతం.. ఇతరులు కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలి.
  3. గేట్(GATE 2024) పరీక్షకు హాజరై ఉండాలి.
  4. వయసు 27 సంవత్సరాలు
  5. SC/ST/OBC/PWD/EBC అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

గేట్-2024 స్కోరు (GATE Score) ఆధారంగా షార్ట్‌ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. వారికి నెలకు రూ.40వేల నుంచి 1.4 లక్షల వేతనం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు వివరాలు

  1. జనరల్/ EWS/ ఓబీసీ అభ్యర్థులు రూ.300
  2. SC/ST/PwBD/Ex Servicemen/ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు

ఫిబ్రవరి 13 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Related Posts

AI: ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఐదు కోర్సులు పూర్తిగా ఉచితం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ‘స్వయం పోర్టల్‌’ ద్వారా ఉచిత ఏఐ కోర్సులను( Free AI courses)…

APPSC బంపర్ ఆఫర్.. కొత్త రిక్రూట్‌మెంట్ నోటీసులు విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) త్వరలోనే భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల( Notices Released) చేయనుంది. ప్రస్తుతం మొత్తం 18 నోటిఫికేషన్లు సిద్ధంగా ఉండగా, అందులో 12కుపైగా క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు సంబంధించినవిగా తెలుస్తోంది. అయితే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *