
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబో “NTR31” అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీపై కీలక అప్డేట్ వచ్చింది. సినిమా మొదటి షెడ్యూల్‌పై మేకర్స్ స్పందించారు. వచ్చే వారం వికారాబాద్ అడవుల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరించనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
అయితే తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనరని పేర్కొంది. అలాగే సెకండాఫ్ షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో భారీ సెట్ వేస్తున్నారు. మార్చిలో ప్రారంభమయ్యే రెండో పార్ట్ షూటింగ్‌లో తారక్ జాయిన్ అవుతారని మూవీ టీమ్ తెలిపింది. కాగా “డ్రాగన్(Dragon)” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్(MVM) అండ్ NTR ఆర్ట్స్ బ్యానర్‌లపై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
నెగటివ్ రోల్‌లో టోవినో థామస్?
కాగా ఈ మూవీలో కన్నడ యువ నటి రుక్మిణి వసంత్(Rukmini Vasant)ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సినీ టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. మరోవైపు, మాలీవుడ్ స్టార్ టోవినో థామస్(Tovino Thomas) ఈ చిత్రంలో నెగటివ్ రోల్ పోషించనున్నట్లు సమాచారం. జనవరి 9, 2026న విడుదల కానున్న ఈ చిత్రానికి KGF, సాలార్ ఫేమ్ రవి బస్రూర్(Ravi Basrur) సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తాం.. వేచి ఉండండి అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.