అరణ్య: రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసే పోటీకి వెళ్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని కూలదోయాలంటే, ఏపీని ప్రగతి పథంలోకి తేవాలంటే ఒంటరిగా వెళ్తే ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యే పనికాదన్న ఆయన.. అనుభవమున్న తెదేపాతో కలిసి దిగేందుకు సిద్ధమైనట్లు స్పష్టం చేశారు. గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు బాలకృష్ణ, లోకేశ్‌తో కలిసి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కుదిరితే బీజేపీ కూడా మాతో కలిసి వచ్చేందుకు ప్రయత్నం చేయాలన్న పవన్.. ఈరోజే పొత్తుపై నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. .జగన్‌కు ఆరు నెలల సమయం మాత్రమే ఉందని.. ఆయన మద్దతుదారులు కూడా ఆయన చేస్తున్న పనుల గురించి ఆలోచించాలని కోరారు. మీకు యుద్ధమే కావాలంటే నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని జనసేనాని స్పష్టం చేశారు.
అలా చేయకుండా నోటిఫికేషన్లు ఇస్తే సీఎం కుర్చీ లాగేస్తాం: తీన్మార్ మల్లన్న
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddey), ఆ పార్టీ బహిష్కృత నేత, MLC తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు(Notifications) జారీ చేస్తే సీఎం రేవంత్…