లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా మరో ఇంట్రస్టింగ్ ఎపిసోడ్‌కు రెడీ అవుతోంది అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. పాప్ గాయని రాజకుమారితో కలిసి జవాన్ పాటకు స్టెప్ వేశారు మెగాస్టార్ చిరంజీవి. ఒక్కో అప్‌డేట్‌తో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది కంగువా మూవీ టీమ్. రీ ఎంట్రీలో వరుసగా భారీ ఆఫర్స్ రావటంతో ఆనందంగా ఉందన్నారు కాజల్ అగర్వాల్. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన జిల్ మూవీ కాంబో మరోసారి రిపీట్ కానుంది.
లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా మరో ఇంట్రస్టింగ్ ఎపిసోడ్‌కు రెడీ అవుతోంది అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఫస్ట్ టైమ్ ఈ షోలో ఓ బాలీవుడ్ హీరో కనిపించబోతున్నారు. యానిమల్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బాలయ్య షోకు హాజరయ్యారు బాలీవుడ్ చాక్లెట్ భాయ్ రణబీర్ కపూర్. మంగళవారం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ జరిగింది.
పాప్ గాయని రాజకుమారితో కలిసి జవాన్ పాటకు స్టెప్ వేశారు మెగాస్టార్ చిరంజీవి. దీవాళి సందర్భంగా జరిగిన ఈ సరదా ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సెలబ్రేషన్స్‌లో భాగంగా ఫిలిం స్టార్స్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ పార్టీలో టాలీవుడ్ సినీ ప్రముఖలు సందడి చేశారు.
ఒక్కో అప్‌డేట్‌తో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది కంగువా మూవీ టీమ్. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పది భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో సూర్య ఐదు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కంగువా నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీ ఎంట్రీలో వరుసగా భారీ ఆఫర్స్ రావటంతో ఆనందంగా ఉందన్నారు కాజల్ అగర్వాల్. లాంగ్ బ్రేక్ తరువాత ఫస్ట్ ఇండియన్ 2 సినిమాకు సైన్ చేయటం గర్వంగా అనిపించింది అన్నారు. ఇండియన్ 2తో పాటు సత్యభామ సినిమా కోసం ట్రెడిషనల్, వెస్ట్రన్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవటం కొత్త ఛాలెంజ్‌లా అనిపించిందని చెప్పారు.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన జిల్ మూవీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. గోపిచంద్ హీరోగా మరో మూవీ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. రాధేశ్యామ్ రిలీజ్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాధాకృష్ణ, మరోసారి యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లోనే వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
Daaku Maharaaj: బాక్సాఫీస్ వద్ద బాలయ్య హంటింగ్.. ‘డాకు’ కలెక్షన్స్ ఇవే?
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), డైరెక్టర్ బాబీ(Director Bobby) దర్శకత్వంలో మూవీ ‘డాకు మహారాజ్(Daaku Mahaaraj)’. సంక్రాంతి(Sankranti) కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులకు కావాల్సిన యాక్షన్‌తో పాటు మంచి ఎమోషన్(Emotions) కూడా ఉండడంతో తొలి ఆట…