నౌ ఏ డేస్ పెట్టుబడి పెట్టే మార్గాలు ఎన్నో ఉన్నాయి. స్టాక్ మార్కెట్(Stack Market), మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) వంటి వాటిలో లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రమాదాలు కూడా ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే చాలా మంది నిపుణులు రిస్క్(Risk) లేకుండా పెట్టుబడి(Safe Investment) పెట్టే మార్గాలను వెతుక్కుంటున్నారు. వాటిలో ముఖ్యమైనవి బ్యాంక్ FDలు అలాగే పోస్టాఫీస్(Post Office) పెట్టుబడులు. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చంటున్నారు.
బ్యాంక్ FD లో పెట్టుబడి వడ్డీ రేటు..
ప్రస్తుతం దేశంలోని చాలా బ్యాంకులు 7 నుంచి 8 శాతం వడ్డీరేటును అందిస్తున్నాయి. కాకపోతే మీరు కనీసం 3-5 సంవత్సరాల వరకు FD చేయాలి. ఎక్కువ కలం మీరు FD చేస్తేనే మీకు బ్యాంకు FD పై మంచి రాబడి వస్తుంది. రిస్క్ ఉండదు.
పోస్టాఫీస్ పెట్టుబడి స్కీములు:
పోస్ట్ ఆఫీస్‌లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి స్కీములు అధిక వడ్డీని అందిస్తున్నా, అందరూ వాటిలో పెట్టుబడి పెట్టలేరు. ఉదాహరణకు, SCSS కేవలం 60 ఏళ్లు నిండిన వారికి మాత్రమే లభిస్తుంది. అలాగే, SSY బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.
అయితే, అందరికీ అందుబాటులో ఉండే స్కీమ్ అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC). ఇది ప్రస్తుతం 7.7 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ స్కీమ్ ను రూ.1000తో ప్రారంభించవచ్చు, గరిష్ట పరిమితి లేదు. అలాగే, కిసాన్ వికాస్ పత్రం (KVP) లో 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.
ఏది మంచిది?
బ్యాంక్ FDలో వడ్డీ 7.5% కన్నా తక్కువగా ఉంటే, పోస్టాఫీస్ NSC లేదా KVP లాంటి స్కీములు మెరుగైన ఎంపిక కావచ్చు. పెట్టుబడికి ముందు వడ్డీరేట్లు, టైం పీరియడ్‌ను బట్టి ఎంపిక చేసుకోవాలి.






