
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఫ్రాన్స్ పర్యటన(France Tour) కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఇవాళ పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రపంచ యుద్ధాల్లో (World War) ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్‌లో (Marseilles) గల మజార్గ్యుస్ వార్ శ్మశానవాటికలో (Mazargues War Cemetery) యుద్ధ స్మారకం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ యుద్ధ స్మారకాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron)తో కలిసి మోదీ సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి భారత సైనికులకు అంజలి ఘటించారు.
❗URGENT : Modi visits Mazargues war cemetery, pays tribute to fallen Indian soldiers #Modi pic.twitter.com/8AI2ZEttpb
— MOHAMMAD AHSAN🎗️ (@MOHAMMAD_AARSH) February 12, 2025
ఇరుదేశాల బంధం మరింత బలోపేతం
దీని గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ… మాసేలోని భారత కాన్సులేట్(Consulate) ద్వారా ఇరుదేశాల బంధం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కాన్సులేట్ భారత్-ఫ్రాన్స్(India-France) దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, పరస్పర ప్రజా సంబంధాల పటిష్టతకు వారధిలా నిలుస్తుందని అభివర్ణించారు. ఈ కాన్సులేట్ ప్రారంభోత్సవంలో కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్(Emmanuel Macron) పాల్గొన్నారు. కాగా ఇవాళ్టితో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగియనుంది. అనంతరం ఆయన అమెరికా(America)కు వెళ్లనున్నారు. గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump)తో భేటీకానున్నారు. రెండో దఫా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశాక మోదీ అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి.