
తాడిపత్రి మాజీ MLA జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy)కి పోలీసులు షాకిచ్చారు. సినీ నటి మాధవీ లత(Madhavi Latha)పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు ఆయనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Cyberabad Cyber Crime Police) పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జేసీ తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అయితే ఆ ఈవెంట్‌కు ఎవరూ వెళ్లొద్దని మాధవీ లత ఓ వీడియో విడుదల చేశారు. దీంతో సీరియస్ అయిన జేసీ ఆమెపై అసభ్యకరంగా మాట్లాడుతూ.. ఆమెను BJP ఇంకా ఎందుకు తమ పార్టీలో కొనసాగిస్తుందోనని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
క్షమాపణలు చెప్పినా సద్దుమణగలేదు..
దీంతో మాధవీ లత TDP అధిష్ఠానానికి, మూవీ అసోసియేషన్(MAA association)కు ఫిర్యాదు చేసింది. అలాగే జనవరి 21న జేసీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబరాబాద్ సైబర్ క్రైమ్(CCC) పీఎస్‌ను ఆశ్రయించింది. కాగా అంతకుముందు మాధవీలతపై JC చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో వెనక్కి తగ్గిన ఆయన మాధవీలతకు క్షమాపణలు(Apologies) కూడా చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం సద్దుమణిగిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ తాజాగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో మళ్లీ ఈ వివాదం తెరమీదకి వచ్చింది.
KCR : ‘తెలంగాణలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం’
‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.’ ఓ సినిమాలో తలైవా రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చం ఇదే డైలాగ్ ను కాస్త అటూ ఇటూగా మార్చి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…