మంచు మనోజ్‌ అరెస్ట్‌.. పోలీస్ స్టేషన్ లో హల్ చల్

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ వివాదం (Manchu Family Controversy) ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నటుడు మంచు మనోజ్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. తిరుపతిలో మనోజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భాకరాపేట ఠాణాకు తరలించినట్లు తెలిసింది. కుటుంబంలో నెలకొన్న వివాదంతో ఆయన తండ్రి మంచు మోహన్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగానే మనోజ్ (Manchu Manoj)ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మీరిక్కడ ఉండటం సేఫ్ కాదు

భాకరాపేట సమీపంలోని ఉర్జా రిసార్టులో మనోజ్ స్టే చేస్తున్నాడు. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు మనోజ్ వద్దకు వెళ్లి.. పలు ప్రశ్నలు అడిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎందుకుంటున్నారని ప్రశ్నిస్తూ.. ఇక్కడ సెలబ్రిటీలు సేఫ్ కాదని చెప్పారు. పోలీసులు డ్రామా చేస్తున్నారంటూ.. తాను అక్కడ రెస్ట్ తీసుకుంటే వారికేం ఇబ్బందంటూ ప్రశ్నించాడు మనోజ్. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నేనేమైనా టెర్రరిస్టా?

“నేనేమైనా టెర్రరిస్టునా.. దొంగనా..? అర్ధరాత్రి ఎందుకు నన్ను బెదిరిస్తున్నారు? ‘సీఎం పేరు ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నారు..?  మీరు నా దగ్గరకు ఎందుకు వచ్చారు? మమ్మల్ని ఎందుకు బెదిరించారో చెబితే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను?’ అంటూ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోని మెట్లపై మనోజ్‌ భీష్మించుకుని కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న సీఐ ఇమ్రాన్‌ భాషా వచ్చి సర్దిచెప్పడంతో ఆయన ఆందోళన విరమించాడు. తన యూనివర్సిటీ వద్ద మనోజ్‌ ఏమైనా గొడవ చేస్తాడనే అనుమానంతో మోహన్‌బాబు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *