ఆర్కే సాగర్(RK Sagar) హీరోగా, మిషా నారంగ్(Misha Narang) జంటగా నటిస్తున్న సినిమా లేటెస్ట్ చిత్రం ‘THE 100’. డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్(Raghav Omkar Shashidhar)) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేశ్ కరుటూరి, వెంకీ పూశడపు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం టీజర్(Teaser), పాటలు(Songs) ఇప్పటికే మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) రిలీజ్ చేశారు. “జీవితంలో జరిగిపోయింది మనం మార్చలేం, కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా ఆపొచ్చు” అంటూ సాగే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో IPS విక్రాంత్ పాత్రలో ఆర్కే సాగర్ కనిపించనున్నారు.
A MOMENT TO TREASURE FOREVER ❤️❤️❤️
Hon’ble DyCM of Andhra Pradesh, our very own Power Star @PawanKalyan garu, launched the intense and gripping trailer of #The100Movie ❤️🔥
With his powerful presence and kind words, he added unmatched value and energy to #The100 journey 🤩
▶️… pic.twitter.com/WdLLekHxs5
— L.VENUGOPAL🌞 (@venupro) July 5, 2025
ఆయుధం చేత పట్టని ఐపీఎస్ పాత్రలో..
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల(Police Officer Role)లో ‘సాగర్(Sagar)’ ఆకట్టుకున్నాడు. సాగర్ బుల్లితెర ప్రేక్షకులకు ‘మొగలిరేకులు’ సీరియల్‌లో పోలీస్ ఆఫీసర్ ‘ఆర్కే నాయుడు’గా సుపరిచితమే. కాగా ది 100 మూవీ కథలో కొత్త పాయింట్ ఉందనీ, అది ఆడియన్స్‌కి తప్పకుండా కనెక్ట్ అవుతుందని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్(Director Raghav Omkar Shashidhar) చెప్పేశాడు. ఆయుధం చేత పట్టకూడదని తనకి తానుగా ఒక నిర్ణయం తీసుకున్న ఓ IPS అధికారి కథే ది 100 చిత్రమని డైరెక్టర్ తెలిపాడు. మూవీలో విక్రాంత్(Sagar) ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ ఆయుధం చేతపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు తెలియాలంటే ‘ది 100’ చూడాల్సిందే.






