
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కాంబోలో వచ్చిన ఎవర్‌గ్రీన్ లవ్, ఫీల్‌గుడ్ మూవీ ‘వర్షం’. 2004లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల మదిలో ఓ చెరగని ముద్రవేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు మ్యూజిక్ లవర్స్‌ని ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. ఇక మూవీతోనే త్రిష తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. డైరెక్టర్ శోభన్ తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటంటే..
మే 23న రీరిలీజ్?
ప్రభాస్-త్రిష జంటగా నటించిన వర్షం (Varsham) మూవీ రీరిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పోస్టులు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ అలాగే హీరోయిన్ త్రిష జంటగా నటించిన వర్షం సినిమాను మే 23వ తేదీన థియేటర్లలో రీరిలీజ్ (Varsham4K Re-Releasing) చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ నవంబర్ 11, 2022లో ఓసారి రీరిలీజ్ చేశారు. మళ్లీ ఇప్పుడు రీరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అప్పట్లో తెలుగు ప్రేక్షకులు ఫిదా
అయితే దీనిపై అధికారిక ప్రకటన ఎక్కడ రాకపోయినా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని వైరల్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు మంచి కలెక్షన్స్(Collections) రాబడుతున్నాయి. అయితే ప్రభాస్ లాంటి సినిమా రీరిలీజ్ అయితే కలెక్షన్లు కూడా.. భారీగానే వస్తాయి. ఇది ఇలా ఉండగా హీరో ప్రభాస్ అలాగే త్రిష జంటగా నటించిన వర్షం సినిమా 2004లో వచ్చింది. ఆ సమయంలో రిలీజ్ అయిన వర్షం సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీకి ఎమ్మెస్ రాజు నిర్మాతగా వ్యవహరించగా గోపీచంద్ విలన్‌గా క్యారెక్టర్‌లో అదరగొట్టారు.