ప్రభాస్ ‘ది రాజా సాబ్’ టీజర్ రిలీజ్ టైం లాక్ ఫిక్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ‘ది రాజా సాబ్’(The Raja Saab) టీజర్ రిలీజ్ టైం ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ టీజర్‌ను జూన్ 16వ తేదీన ఉదయం 10:52 గంటలకు విడుదల చేయనున్నట్లు దర్శకుడు మారుతి అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ డేట్‌ను వెల్లడించిన చిత్రబృందం… ఇప్పుడు స్పెషల్ టైం కూడా లాక్ చేసింది. టీజర్‌ను యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయనున్నారు.

ప్రభాస్ కెరీర్‌లో ఇదే తొలి హారర్ జానర్ మూవీ కావడం విశేషం. మరోవైపు, ప్రేమ కథ చిత్రం, భలే భలే మగాడివోయ్, ప్రతి రోజు పండగే లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు మారుతి… ఈసారి ప్రభాస్‌ను కొత్త కోణంలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. టీజర్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సమాచారం ప్రకారం మాళవిక మోహనన్ యాక్షన్ సీన్లలోనూ కనిపించనుంది. ఈ మల్టీ లాంగ్వేజ్ హారర్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీ.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *